తొలి సీఎం కుమారుడికి జీవితఖైదు
ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర తొలి సీఎం అజిత్ జోగి కుమారుడు జేసీసీ(జే) నేత అమిత్ జోగికి హైకోర్టు జీవిత ఖైదు శిక్షను విధించింది. ఎన్సీపీ ట్రెజరర్ రామ్ అవతార్ జగ్గీ హత్య కేసులో ఆయనను దోషిగా నిర్ధారించింది. గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. కాగా, ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అమిత్ తెలిపారు.