మంగళగిరి స్టేడియంపై కేశినేని చిన్ని కీలక ప్రకటన

మంగళగిరి స్టేడియంపై కేశినేని చిన్ని కీలక ప్రకటన

GNTR: మంగళగిరిలోని అమరావతి క్రికెట్ స్టేడియంను బుధవారం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సందర్శించారు. వచ్చే మే నాటికి స్టేడియం పనులన్నీ పూర్తి చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇక్కడ ఏపీఎల్ మ్యాచ్‌లను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ మైదానం త్వరలోనే క్రీడాభిమానులకు అందుబాటులోకి రానుందని తెలిపారు.