VIDEO: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
RR: మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని పెట్రోల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.