విద్యార్థి సూసైడ్ కేసులో.. 12 మంది అరెస్ట్
కృష్ణా: పోరంకిలో ఇంటర్ చదువుతున్న పవన్‌కుమార్ సుసైడ్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. తోటి విద్యార్థులు కొట్టి వీడియోలు తీసి SMలో పోస్టు చేయడంతో మనస్తాపానికి గురై పవన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. తనను కొట్టిన విద్యార్థుల పేర్లను చేతిపై రాసుకున్న పవన్ ఆధారాలను కళాశాల సిబ్బంది తుడిచేశారని దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో 12 మందిని అరెస్ట్ చేశారు.