నిరుద్యోగులకు ప్రభుత్వం ఉగాది కానుక
AP: ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో భారీగా కొలువుల భర్తీకి శ్రీకారం చుడుతూ 10,060 పోస్టులతో కూడిన 'జాబ్ క్యాలెండర్-2026'ను ఈరోజు విడుదల చేయనుంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు ఇందులో ఉండనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.