ఈనెల 3న నర్సరీ పండ్ల తోటల వేలం

ఈనెల 3న నర్సరీ పండ్ల తోటల వేలం

ASF: కాగజ్ నగర్ మండలంలోని జంబుగా ఉద్యాన నర్సరీ మామిడిపండ్ల తోటలను ఈనెల 3న వేలం వేస్తున్నట్లు ఐటీడీఏ పీవో కుష్బూగుప్త తెలిపారు. ఈ వేలం పాటలో (2025- 26-27) మూడు సంవత్సరాలకు కలిపి వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తోటలో బంగినపల్లి, దశేరి తోతాపురి, రసాలు వంటి హైబ్రిడ్ రకాలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 11 గంటలకు వేలంపాటలో పాల్గొనాల్సిందిగా కోరారు.