VIDEO: వింత ఘటన.. మిరప చెట్టుకు వంకాయలు
ఎన్టీఆర్ జిల్లా తక్కెళ్లపాడులో వింత ఘటన చోటుచేసుకుంది. మిరప చెట్టుకి మిరప కాయలకు బదులుగా వంకాయలు, టమాటాలు కాశాయి. తోట మొత్తంలో రెండు చెట్లకు మాత్రమే ఇలా కాయడంతో ఆ తోట యజమాని అవాక్కయ్యారు. ఈ విషయంపై స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.