చంద్రబాబును కలిసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే

చంద్రబాబును కలిసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే

కాకినాడ: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా శనివారం అసెంబ్లీలోని ఛాంబర్లో సీఎం చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యలతో పాటు విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని ఆమె సీఎంను కోరారు. విన్నపంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు.