జిల్లాలో పెరుగుతున్న ఎండలు
సత్యసాయి: జిల్లాలో ఎండలు పెరిగిపోతున్నాయి. సోమవారం బుక్కపట్నంలో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పుట్టపర్తి పరిసరాల్లో కూడా ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరడంతో జనం అల్లాడిపోతున్నారు. రానున్న వారం రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ప్రజలు బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.