'విధుల కేటాయింపులో పారదర్శకత పాటించాలి'
NLG: చిట్యాల మండలంలో జనగణన విధుల కేటాయింపులో పారదర్శకత పాటించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఇవాళ తహసీల్దార్ విజయకు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులకు సీనియార్టీ ప్రాతిపదికన, ఎలాంటి పక్షపాతం లేకుండా నిబంధనల మేరకు విధులు కేటాయించాలని సంఘం ప్రతినిధులు ఏషమల్ల నాగయ్య, గడగోజు సతీష్ డిమాండ్ చేశారు.