నాటుసారా రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

నాటుసారా రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

కర్నూలు: నాటుసారా రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని కోసిగి ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నాటుసారా నిర్మూలన కోసం నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా హనుమాపురంలో నాటుసారాపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. నాటుసారా వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. నాటుసారా అమ్మడం, తయారు చేయడం జరిగితే చర్యలు తప్పవని పేర్కొన్నారు.