108 వాహనంలో ప్రసవం .. తల్లీ, బిడ్డ క్షేమం

108 వాహనంలో ప్రసవం .. తల్లీ, బిడ్డ క్షేమం

GDWL: మానవపాడు మండలం పెద్దపోతులపాడుకు చెందిన సలీమాకు ఆదివారం పురిటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. ఈ సందర్భంగా ఆమెను పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే వాహనంలో ప్రసవం జరిగింది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కల్పన సమయస్ఫూర్తితో వ్యవహరించి మగబిడ్డకు పురుడు పోసింది. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారని వైద్యలు తెలిపారు.