ఒంగోలు రైల్వే స్టేషన్‌లో సంతకాల సేకరణ

ఒంగోలు రైల్వే స్టేషన్‌లో సంతకాల సేకరణ

ప్రకాశం: ఒంగోలు రైల్వే స్టేషన్‌లో శుక్రవారం స్వచ్చ్ రైల్, స్వచ్చ్ భారత్ నినాదాలతో స్వచ్ఛతా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రైల్వే అధికారులు నిర్వహించారు. స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని ప్రయాణికులు సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. రైల్వే సిబ్బంది మాట్లాడుతూ.. రేపటితరం కోసం ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్నారు.