పేలిన సిలిండర్.. ఇల్లు దగ్దం

పేలిన సిలిండర్.. ఇల్లు దగ్దం

ELR: కుక్కునూరు మండలం దామరాచర్ల గ్రామంలోని ఓ ఇంట్లో కరెంట్ షాక్ రావడంతో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కుటుంబసభ్యులు గుడికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.