VIDEO: రజకులపై దాడి ఘటనకు నిరసనగా హన్మకొండలో ధర్నా
HNK: నాగర్‌కర్నూల్ జిల్లాలో రజకులపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆదివారం హన్మకొండ నగరంలో అంబేద్కర్ జంక్షన్ వద్ద తెలంగాణ రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోదిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. 2 నెలల పసికందు హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దురిశెట్టి చందు,అంబాల అనిల్, బొడ్డుపల్లి బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.