పీహెచ్‌సీలో హోంమంత్రి ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీలో హోంమంత్రి ఆకస్మిక తనిఖీ

AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హోంమంత్రి అనిత ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరైన సిబ్బంది యూనిఫామ్‌లో ఎందుకు లేరని ప్రశ్నించారు. తక్షణమే డాక్టర్, సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ ఇవ్వాలని జిల్లా వైద్యాధికారికి హోంమంత్రి ఆదేశించారు.