హత్య కేసులో నిందితుడు అరెస్ట్

TPT: హత్య కేసులో నిందితుడిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 20న CPR అర్బన్ అపార్ట్మెంట్ 202లో ధనలక్ష్మి (73)ని హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా, ధనలక్ష్మి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు బందేల రవిని ఆటోనగర్ బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు. అనంతరం అలిపిరి పోలీసులు ముద్దాయి నుండి ధనలక్ష్మి చెవిలోని కమ్మలు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించారు.