ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎంపీపీ
SKLM: ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి పీడీ యాక్ట్‌పై అరెస్ట్ అవటంతో విశాఖలోని సెంట్రల్ జైల్లో ఉన్నారు. మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు విజయ్ కుమారిని ఎంపీపీగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఈశ్వరరావును ఎంపీపీ గురువారం కలిశారు. మండల్ పరిషత్ ప్రగతికి పూర్తిగా సహకరించనున్నట్లు ఆయన చెప్పారు.