రెండో రోజు ముచ్చింతల్‌లో బ్రహ్మోత్సవాలు

TG: రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్‌లో రెండో రోజు 16వ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 11 వరకు సాకేత క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఉదయం 8 గంటలకు ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ చేశారు. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.