'మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి'

SDPT: మహిళలు రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై కృష్ణారెడ్డి అన్నారు. జగదేవ్‌పూర్ మండలం జిల్లా పరిషత్ హై స్కూల్‌లో గజ్వేల్ షీటీమ్ బృందం ఆధ్వర్యంలో మంగళవారం మహిళలు, విద్యార్థుల రక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలకు గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలన్నారు.