సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే సునీత
ATP: వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. వివిధ సమస్యలపై విచ్చేసిన వారి నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. తమ సమస్యలను అధికారులతో మాట్లాడి వేగవంతంగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.