యూరియా కొరత తీర్చిన బీజేపీ ఎమ్మెల్యే
NRML: దిలావర్ పూర్ మండలం లోలం గ్రామంలో ఇటీవల బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పర్యటించారు. యూరియా సరఫరా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. కాగా, సోమవారం గ్రామానికి లారీ లోడ్ యూరియా రావడంతో గ్రామంలోని రైతులకు యూరియాను అందజేశారు. దీంతో ఎమ్మెల్యేకు రైతులు, బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.