VIDEO: కళ్యాణి వాగు ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరు

VIDEO: కళ్యాణి వాగు ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరు

KMR: ఎల్లారెడ్డి మండలం కల్యాణి ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గత నెల 27న మట్టి కట్టలు తెగిపోయాయి. ఎగువ నుంచి ఉధృతంగా వచ్చిన వరద నీటితో ప్రాజెక్టు కుడి, ఎడమ మట్టికట్టలు కొట్టుకుపోవడంతో బొగ్గుగుడిసె చౌరస్తా నీటమునిగింది. ఈ నేపథ్యంలో, మట్టి కట్టలకు తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేసిందని నీటిపారుదల శాఖ అధికారులు సోమవారం తెలిపారు.