'గణతంత్ర వేడుకల్లో వికారాబాద్‌ కళాకారుల సందడి'

'గణతంత్ర వేడుకల్లో వికారాబాద్‌ కళాకారుల సందడి'

VKB: ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు వికారాబాద్‌ జిల్లా కళాకారులు ఎంపికయ్యారు. కొడంగల్ మండలం సంగాయిపల్లికి చెందిన శివ కుమార్, బొంరాస్‌పేట మండలం తుంకిమెట్లకు చెందిన జోగు మల్లేష్ ఒగ్గుడోలు ప్రదర్శన ఇవ్వనున్నారు. రాష్ట్రం నుంచి ఎంపికైన 30 మంది బృందంలో వీరు భాగస్వాములు. ఈ నెల 26న రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో ప్రతిభ చాటే అవకాశం రావడం తమ అదృష్టం అని వారు తెలిపారు.