మున్సిపల్ పోలింగ్‌.. 77.92 శాతం నమోదు

మున్సిపల్ పోలింగ్‌.. 77.92 శాతం నమోదు

SRPT: జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 77.92 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. మొత్తం 2,19,912 గాను 1,71,359 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. అత్యధికంగా తిరుమలగిరిలో 88.35 శాతం, అత్యల్పంగా హుజూర్‌నగర్‌లో 60.88 శాతం పోలింగ్ నమోదైంది.