భూగర్భ జలాల పెంపునకు కలెక్టర్ ఆదేశం

భూగర్భ జలాల పెంపునకు కలెక్టర్ ఆదేశం

E.G: జలధార - జలహారతి ద్వారా భూగర్భ జలాల స్థాయి పెంపునకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె జిల్లాలో గుర్తించిన 1,265 చెరువుల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్ల ద్వారా 411 పనులను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో 173 పనులకు ఆమోదం లభించిందని, మిగిలిన పనులపై అధికారులు చొరవ చూపాలని సూచించారు.