బండారుపల్లిలో ఘోర ప్రమాదం.. తెగిపడిన చేయి
ములుగు మండలం బండారుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంటి నిర్మాణం కోసం కాంక్రీట్ మిల్లర్‌ను తీసుకువెళ్తుండగా, అది విద్యుత్ స్తంభానికి ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన చుంచు భిక్షపతి కుడి చేయి మణికట్టు వరకు తెగిపడింది. వెంటనే తెగిన చేతిని ప్లాస్టిక్ కవర్‌లో ఉంచి 108 అంబులెన్స్‌లో ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.