మరికల్‌లో ఏప్రిల్ 9న హిందూ మహాసమ్మేళనం

మరికల్‌లో ఏప్రిల్ 9న హిందూ మహాసమ్మేళనం

NRPT: మరికల్ మండలంలో ఏప్రిల్ 9న హిందూ మహాసమ్మేళనం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా చెన్నయ్య, అధ్యక్షులుగా వెంకటేశ్వర శర్మ, ఉపాధ్యక్షులుగా రఘుపతి రెడ్డి, ఆంజనేయులు, హనుమంతు ఎన్నికయ్యారు. ఈ సమ్మేళనంలో పలు గ్రామాల ప్రజలు  పాల్గొంటారని తెలిపారు.