గుంతలతో ప్రయాణికుల ఇబ్బందులు
VZM: పాతబొబ్బిలి–రామభద్రపురం ప్రధాన రహదారిలో పెద్ద గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5–6 ఏళ్లుగా రోడ్డు దుస్థితి ఇలానే కొనసాగుతూనే ఉంది. అప్పుడప్పుడు మరమ్మతులు చేసినా వర్షం పడగానే మళ్లీ గోతులు ఏర్పడుతున్నాయి. కనీసం తాత్కాలికంగా అయినా గోతులను కప్పి ప్రయాణ సౌలభ్యం కల్పించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.