ట్రేడ్ లైసెన్స్ లేని హోటల్స్ సీజ్

RR: నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్, షాపులు నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ హెచ్చరించారు. ఈరోజు అత్తాపూర్ జంక్షన్ వద్ద ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడుస్తున్న టిఫిన్ సెంటర్, ఫుట్‌పాత్ ప్రాంతాన్ని ఆక్రమించిన మరో టిఫిన్ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలన్నారు.