రైతుపై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు

ATP: యాడికి మండలం వీరన్నపల్లి గ్రామానికి చెందిన వీర రమేశ్‌తోపాటు మరో వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన వరకృష్ణ తన పొలంలో ఉండగా.. రమేశ్‌లోపాటు మరో వ్యక్తి ఆయనతో గొడవపడ్డారు. పొలంలో తమకు వాటా ఉందని దాడి చేసి కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వీరన్న చెప్పారు.