VIDEO: ఖైదీల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన న్యాయమూర్తి
AKP: నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పీ.షియాజ్ ఖాన్ శనివారం సబ్ జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలతో మాట్లాడుతూ.. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జైలుకు వైద్యాధికారి ప్రతివారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని జైలు సిబ్బందిని ఆదేశించారు. ఖైదీల ఆరోగ్య పరిస్థితి బాగుండే విధంగా శుభ్రత వాతావరణం ఏర్పాటు చేయాలన్నారు.