కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శిగా వెంకట్ గౌడ్
KMR: జిల్లాకు చెందిన సైదాగౌని వెంకట్ గౌడ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. సూర్యాపేటలో నిర్వహించిన సంఘ మహాసభలో రాష్ట్ర కమిటీని నియమించారు. వెంకట్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో కల్లు గీత వృత్తి రక్షణకై కృషి చేస్తానని తెలిపారు. గౌడ గీత కార్మికులందరినీ ఐక్యం చేసి, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.