దారుణం.. భార్య, అత్తను హత్య చేసిన వ్యక్తి
తూర్పు గోదావరి: భార్య, అత్తను ఓ వ్యక్తి కత్తితో పొడిచి హతమార్చిన ఘటన సీతానగరం మండలంలో చోటుచేసుకుంది. బొబ్బిలంకు చెందిన వ్యక్తి తన భార్య, అత్తను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా, వారి హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.