పోలాకి పీహెచ్సీలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
SKLM: పోలాకి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో మామోగ్రఫీ, గర్భాశయ ముఖద్వారా పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.