శాంతిభద్రతల పరిరక్షణలో మంత్రి పాత్ర అభినందనీయం: ఎమ్మెల్యే
ATP: మంత్రి వంగలపూడి అనితకు ఎమ్మెల్యే బండారు శ్రావణి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆమె కోరుకున్నారు. ప్రజా సేవలో అనిత మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో మహిళా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో మంత్రి పోషిస్తున్న పాత్ర అభినందనీయమని కొనియాడారు.