బోరిగాం గ్రామంలో తాగునీటి సంక్షోభం
NRML: లక్ష్మణచాంద మండలం బోరిగాం గ్రామంలో తీవ్రమైన తాగునీటి సమస్య నెలకొంది. చేతిపంపులపై అక్రమంగా మోటార్లు అమర్చి కొందరు వ్యక్తులు నీటిని దారి మళ్లిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. వెంటనే అక్రమ మోటార్లు తొలగించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.