VIDEO: నూజివీడు డివై ఈఓగా సుధాకర్

ELR: నూజివీడు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారిగా డాక్టర్ పి.ఎస్ సుధాకర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. సుధాకర్ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో ఉన్న ఆరు మండలాల్లో పాఠశాలల పురోభివృద్ధి, విద్యార్థుల ప్రగతి పట్ల 100% కృషి చేస్తానన్నారు. అందుకోసం ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంగా కృషి చేయవలసి ఉందని స్పష్టం చేశారు. విద్య, ఇతర అంశాలలో ప్రగతి సాధించాలన్నారు.