భారీ వర్షాలు.. ఎస్పీ సూచనలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా రహదారులు దెబ్బతిని చెరువులు, వాగులు, కాలువలు ఉధృ తంగా ప్రవహిస్తున్నాయని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలెవరూ నీటి వద్ద గుమికూడవద్దన్నారు. పాత శిథిల గృహాలలో నివసించవద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందజేయాలని సూచించారు.