'అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలి'
NTR: రాబోయే 3 రోజుల పాటు అకాల వర్షాలు, వడగండ్ల వానల అవకాశాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాలలో నీరు నిల్వ కాకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా నీటి నిల్వలు ఏర్పడితే తక్షణమే తొలగించే చర్యలు తీసుకోవాలని సూచించారు.