బాలాలయ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NLR: కలిగిరి గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో బాలాలయ ప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. వేదమంత్రోచ్ఛారణలు, నాదస్వర ధ్వనులతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి MLA కాకర్ల సురేష్ కూడా పాల్గొన్నారు. స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.