అటవీ ప్రాంతంలో మహిళ అస్తిపంజరం

అటవీ ప్రాంతంలో మహిళ అస్తిపంజరం

NLR: కావలి మండలం సిరిపురం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం అస్తిపంజరంలా మారి, పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో మంగళవారం వెలుగు చూసింది. సుమారు పది రోజుల కిందట మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కావలి రూరల్ పోలీసులు, 55 ఏళ్లు పైబడిన మహిళ ఎర్ర చీర ధరించి, ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు.