ఈనెల 13న జాబ్ మేళా

ఈనెల 13న జాబ్ మేళా

W.G: నరసాపురంలోని శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో ఈనెల 13వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకమాన్ సోమవారం తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే లక్ష్యంతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా ఈ మేళా నిర్వహిస్తున్నాయన్నారు. 18-35 సంవత్సరాల వయసు ఉండి, పదో తరగతి ఆపై చదివినవారు ఉద్యోగాలకు అర్హులన్నారు.