తల్లి వేధింపులే హత్యకు దారితీశాయ్: డీసీపీ

HYD: జీడిమెట్లలో తల్లిని ప్రియుడితో కలిసి హత్య చేసిన కేసులో కొత్త కోణాలు బయటపడ్డాయి. బాలానగర్ డీసీపీ సురేశ్ కుమార్ వివరాలు తెలుపుతూ.. మృతురాలి పెద్ద కూతురు 7వ తరగతి నుంచే తల్లిదండ్రుల వేధింపులకు గురై హోంలో ఉన్నట్లు తెలిసింది. మొదట ప్రేమను అంగీకరించిన తల్లి తరువాత ఆమె ప్రియుడు శివను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలిసింది. దీంతో ఆమెను హత్య చేసినట్లు డీసీపీ తెలిపారు.