'కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా ఆన్‌లైన్ సేవలు అందిస్తాం'

'కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా ఆన్‌లైన్ సేవలు అందిస్తాం'

ఏలూరు క్రాంతి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహా జనసభ డీసీసీబీ సీఈవో సింహాచలం అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంతో సిబ్బంది కుమ్మక్కై సహకార సంఘాన్ని నష్టాల బాట పట్టించారని విమర్శించారు. 2నెలల్లో కమర్షియల్ బ్యాంకులకు దీటుగా ఆన్‌లైన్ సేవలు అందిస్తామన్నారు.