'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి'
SKLM: కవిటి SVJ కాలేజ్‌లో ఏపీ నైపుణ్య శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను అధికారులు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.