బండి సంజయ్‌కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్

బండి సంజయ్‌కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్

KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.12 ఏళ్ల బీజేపీ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై  ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు.సెక్యూరిటీ లేకుండా జనాల్లో తిరగడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమా? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నిసార్లు ఓడిపోయారో మర్చిపోయారా? అని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని పేర్కొన్నారు.