కావలి ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి
NLR: కావలిలో ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డిని, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డిని కావ్య క్రిష్ణారెడ్డి శాలువాతో సన్మానించారు. ఇరువురు ఎమ్మెల్యేలు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై, పార్టీ బలోపేతం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించుకున్నారు.