పదవీ విరమణ పొందిన ఏఎస్సైలకు ఘన సన్మానం
NRML: జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన డల్లు సింగ్, శంకర్, మారుతి, నారాయణ రెడ్డి (ASIలు) పదవీ విరమణ సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల వారిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వారి క్రమశిక్షణ, నిబద్ధత, బాధ్యతాయుత సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.