VIDEO: 'ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందిద్దాం'
VZM: ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబు కోరారు. శుక్రవారం తన ఛాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు తమ ప్రతినిధిగా ఒక బూత్ లెవల్ ఏజెంట్‌ను నియమించుకోవాలని సూచించారు.